విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 27వ వార్డు అశోక్ నగర్‌లో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ స్వయంగా పాల్గొని వృద్ధులు, వికలాంగులు, విధవలకు పెన్షన్ నగదును అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్ణీత సమయానికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. పథకాల పంపిణీలో అవినీతికి తావులేకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.