పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు వైసీపీలో తగిన గుర్తింపు లభిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన నియోజకవర్గంలోని పలు వార్డుల్లో జరుగుతున్న ఆన్‌లైన్ క్యాడర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షించి, కార్యకర్తలకు పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు ఘనస్వాగతం పలకాలని శ్రేణులకు సూచించారు.