నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధ్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ మరియు స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా ఈ సదస్సు నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో సన్నాహక సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.