విశాఖ: లయన్స్‌ ‍క్యాన్సర్‌ ఆస్పత్రికి రూ. 1, 50, 000 విరాళం

విశాఖపట్నంలోని లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్. వి. ఎన్. దుర్గా ప్రసాదరావు తన కుమార్తె పద్మజ (అమెరికా) తరపున గురువారం రూ. 1, 50, 000 విరాళాన్ని అందజేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ డి. సూర్య ప్రకాష్ సమక్షంలో మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ వి. ఉమా మహేశ్వరరావు ఈ చెక్కును స్వీకరించారు. ఈ నిధులను ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్