విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆదివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సు దిగుతున్న సమయంలో డ్రైవర్ అకస్మాత్తుగా బస్సును ముందుకు పోనివ్వడంతో ఒక ప్రయాణికురాలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. తోటి ప్రయాణికులు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సుల వల్ల జరుగుతున్న ప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.