విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివారం మాలధారణ చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రత్యేక పూజా కార్యక్రమం గురుస్వామి శ్రీను గారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం గౌరవ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, నేరెళ్ల కోనేరు ప్రెసిడెంట్ రమేష్, వార్డు ఇంచార్జ్ కందుల బద్రీనాథ్ అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.