విశాఖ: మహిళా రిజర్వేషన్లపై టీడీపీ మహిళల సంబరాలు

విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఎస్‌. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు మహిళా రిజర్వేషన్ల నిర్ణయానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ మహిళా సాధికారతను చేతల్లో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు.

సంబంధిత పోస్ట్