ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఒత్తిడి వల్లే ప్రభుత్వం హామీల అమలుకు ముందుకు వస్తోందని ఆయన అన్నారు. విశాఖ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బొత్స, వైఎస్సార్‌సీపీ ఒత్తిడి కారణంగానే అమ్మఒడి అరకొరగా అమలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పాలన పడకేసిందని ఆయన ఆరోపించారు.