విశాఖ‌: విద్యుత్ రంగం బలోపేతమే లక్ష్యం

విశాఖ జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి నిర్వహించిన విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయన అభివృద్ధి పనులపై సమీక్షించారు. 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ', 'పీఎం కుసుమ్' వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ కేబుల్ పనులు, సబ్ స్టేషన్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్