విశాఖ‌: వన్డే మ్యాచ్‌కు పటిష్ట భద్రత

భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ కోసం 1,500 మంది సిబ్బందితో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. ప్రేక్షకులు మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు స్టేడియంలోకి అనుమతించబడతారు. వాటర్ బాటిల్స్, తినుబండారాలను నిషేధించారు. నకిలీ టికెట్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. స్టేడియం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్