విశాఖ: అమ్మవారి సన్నిధిలో అపూర్వ నాదస్వరం

విశాఖలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సాయంత్రం 'వీణావాదన సేవ'ను అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు జరిగిన ఈ అపూర్వ నాద నీరాజనం భక్తులను పరవశింపజేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె. శోభరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు వంద మంది వీణ వైదుష్య శిరోమణులు, నారీమణులు ఏకధాటిగా వీణ వాయిస్తూ అమ్మవారికి స్వరార్చన గావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్