విశాఖపట్నంలోని 38వ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా పాక్షికంగా దగ్ధమైన ఇంటి బాధితులను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం పరామర్శించారు. ఆయన కుమారుడు వాసుపల్లి సూర్య, పార్టీ శ్రేణులతో కలిసి బాధితులైన కర్రి బేబీ, గంగాధర్ కిరణ్ బాబులను కలిసి ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా రూ. 10,000 నగదు అందజేసి, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు గురజాపు రవి, రామరాజు తదితరులు పాల్గొన్నారు.