విశాఖ: కూటమి ప్రభుత్వంపై వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్రాంతి కానుక ఏదని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలోని 31వ వార్డులో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన, విజేతలకు బహుమతులు అందజేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన కందిపప్పును కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని, గోధుమపిండి పంపిణీ కూడా అరకొరగానే సాగుతోందని విమర్శించారు. కేవలం పంచదార, రాగులు మాత్రమే ఇవ్వడం విడ్డూరమని, ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్