విశాఖ‌: కూటమి పాలనపై వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన గర్జన

విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు గునపం పోటు పొడిచిందని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ఆయన ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ నుండి దుర్గాలమ్మ గుడి జంక్షన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. దాదాపు 500 మందితో బైకులు, ఆటోలు, గుర్రాలు, ఒంటెలతో సాగిన ఈ ప్రదర్శనలో, వైకాపా శ్రేణులు చంద్రబాబు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారంటూ ఆంధ్రప్రదేశ్ నమూనాను గునపంతో పొడుస్తూ నిరసన వ్యక్తం చేశాయి. స్థానిక ప్రజల మద్దతుతో ఈ కార్యక్రమం విజయవంతమైందని పార్టీ నేతలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్