విశాఖపట్నం సూర్యాబాగ్‌లోని శ్రీ విశ్వేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 78 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు దేవాదాయశాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం దాఖలు చేసిన ఓఏ నెం. 1504/2010 కేసులో ట్రిబ్యునల్ దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, ఆక్రమణదారుడు ఆ స్థలాన్ని దేవాదాయశాఖ జిల్లా అధికారిణి టి. అన్నపూర్ణ, దేవాలయ మేనేజర్ ఎ. దేముళ్ళుకు అప్పగించారు.