విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఇటువంటి ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే 40 పెద్ద కంపెనీలతో మరో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి టి. చాముండేశ్వరరావు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ అరుణల పర్యవేక్షణలో జరిగిన ఈ ఉపాధి శిబిరానికి నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది.