విశాఖ: సాగరతీరంలో త్యాగ–శ్యామ–దీక్షితార్ ఆరాధన

విశాఖ బీచ్ రోడ్డులోని అన్నమయ్య విగ్రహం వద్ద పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగ–శ్యామ–దీక్షితార్ ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. విశ్రాంత ఆచార్యులు కోలవెన్ను మలయవాసిని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. ఎన్. సి. రంగాచార్యులు సంగీత సేవలను ప్రశంసించారు. ఎం. సుధారాణి గాత్రం, వాయిద్య కళాకారుల ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పట్టా ఫౌండేషన్ సేవలను నిర్వాహకులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్