గత వై.సి.పి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని విశాఖ దక్షిణ వై.సి.పి. సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ర్యాలీకి మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఏవీఎన్ కళాశాల నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వై.సి.పి. శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ప్రైవేటీకరణను ఆపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.