విశాఖ: పెట్రోల్ కొరతపై వైసీపీ వినూత్న నిరసన

విశాఖపట్నం జగదంబ జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం ఇంధన కొరతపై వినూత్న నిరసన చేపట్టారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్న వాహనదారులకు మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశారు. ఆటోలకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ధరలు పెంచేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్