విశాఖ: కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు వైసీపీ అండ

వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, క్యాన్సర్‌తో బాధపడుతున్న సౌత్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్ భార్య రోజా రాణిని పరామర్శించారు. ఇప్పటికే రెండుసార్లు ఆర్థిక సాయం అందించిన ఆయన, తాజాగా రక్త సేకరణ కోసం మరో రూ. 5,000 అందజేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్‌ను కలిసి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్ర పురోభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని, మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్