నేవీ అధికారి కారు ఢీకొని గాయపడిన మహిళ మృతి

విశాఖలో యారాడ కొండపై బుధవారం సాయంత్రం నేవీ అధికారి కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన బంక జయ అనే మహిళ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. యారాడ గ్రామానికి చెందిన జయ, నేవీ క్వార్టర్స్‌లో సర్వెంట్‌గా పనిచేస్తూ ఇంటికి వెళ్లేందుకు జంక్షన్‌లో కూర్చున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు గాజువాక పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్