విశాఖలో వైసిపి నేతల నిరసన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల భార్యలను నీచమైన భాషలో దూషించిన ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ శ్రేణులు విశాఖపట్నంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టాయి. సంస్కారం మరచి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, వాటిని వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.

సంబంధిత పోస్ట్