తీవ్రమైన వేసవి కారణంగా విశాఖపట్నం జిల్లాలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2024 డిసెంబర్ నుండి 2025 మే వరకు 8,11,091 కేసుల అమ్మకాలతో పోలిస్తే, 2025 డిసెంబర్ నుండి 2026 మే 25 వరకు 46% వృద్ధితో 11,24,885 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మార్చి నుంచే ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలోని 160 మద్యం దుకాణాలు, 96 బార్లతో పాటు స్టార్ హోటళ్లు, క్లబ్‌లలో బీర్లకు గిరాకీ పెరిగిందని ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.