విశాఖలో రూ. 7. 5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖ వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మంగళవారం అగనంపూడి జోన్ 77వ వార్డు పరిధిలోని దువ్వాడ, పెదపాలెం, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో సుమారు రూ. 7.50 కోట్ల జీవీఎంసీ నిధులతో చేపట్టనున్న తారు రోడ్లు, డ్రైనేజీ పనులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేటర్ బట్టు సూర్యకుమారితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్