విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖ నగరంలోని బిర్లా జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా అతివేగంగా దూసుకొచ్చిన కియా కారు, గ్రీన్ సిగ్నల్‌లో వెళ్తున్న GT 650 బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కియా కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వగా, కారులోని రెండు ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్