గోపాలపట్నం: యువతిని వేధించిన యువకుడు అరెస్ట్

ప్రేమ పేరుతో యువతిని బలవంతంగా డబ్బులు అడిగిన వ్యక్తిని గోపాలపట్నం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా జోగంపేటకు చెందిన సరమండ శ్రీను(30) గోపాలపట్నానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో ప్రేమ పేరుతో సన్నిహితంగా మెలిగి, ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్