విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో తిరుమలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షలు రాసిన తర్వాత ఆమె ఉచిత బస్సులో విజయవాడకు వచ్చి, అక్కడి నుంచి నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. అర్ధరాత్రి బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అక్కడ పోలీసులు ఆమెను గుర్తించారు. అనంతరం విచారణ జరిపి యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.