గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలు ఉన్న విశాఖపట్నం నగరానికి పూర్తి స్థాయి ఎయిర్‌పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. నగర మౌలిక వసతుల లేమిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత, ఇప్పుడు వచ్చి డైవర్స్ ఇస్తానంటే ఏమైనా అర్థం ఉందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.