కంచరపాలెం: వైన్ షాప్ వద్దంటూ ఆందోళన

విశాఖపట్నంలోని కంచరపాలెం రామ్మూర్తి పంతులుపేటలో నూతనంగా వైన్ షాప్ ఏర్పాటు చేసే ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో పైడితలమ్మ గుడి, డీజిల్ లోకోషెడ్, పోర్టు యార్డులు ఉండటంతో పాటు, పిల్లలు స్కూల్‌కు వెళ్లే ప్రధాన మార్గంగా ఉండటంతో షాప్‌కి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్