విశాఖలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేష్ భేటీ

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం విశాఖపట్నం వచ్చిన కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్ల లభ్యత, బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు, సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ఈ భేటీ జరిగింది.

సంబంధిత పోస్ట్