విశాఖలో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. యువత, పార్టీ శ్రేణులు ప్లకార్డులతో మద్దతు తెలిపారు. నాయకులను, కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం, ఆయన రోడ్డు మార్గంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్