ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో ప్రముఖ ఫార్మా సంస్థ 'బ్లూ జెట్ హెల్త్ కేర్' యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన విశాఖ చేరుకున్నారు. ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని బస చేశారు.