పద్మనాభం: నీటిలో కొట్టుకుపోయిన బాలిక

పద్మనాభం మండలం మద్ది పంచాయతీ పరిధిలోని తునిపొలం గ్రామానికి చెందిన 12 ఏళ్ల ధనుశ్రీ, స్నేహితులతో కలిసి పల్లె గెడ్డ కాజ్ వే వద్దకు వెళ్లింది. నీటిలోకి దిగిన ఆమె అదుపుతప్పి గెడ్డలో కొట్టుకుపోయింది. స్థానికులు, మహిళలు రక్షించేందుకు ప్రయత్నించినా ప్రవాహ వేగం కారణంగా విఫలమయ్యారు. తహసీల్దార్, పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టారు. బాలిక ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్