విశాఖపట్నంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 40-50 మంది నుంచి రూ.10 కోట్లకుపైగా వసూలు చేసిన మహ్మద్ అజీమ్ ఖాన్‌ను కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు తిరిగి కోరిన బాధితుడిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశాడని ఆరోపణలున్నాయి. హనీట్రాప్ కేసులోనూ ముద్దాయిగా ఉన్న అజీమ్ ఖాన్‌పై డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.