సింహాచల క్షేత్రంలో వైభవంగా స్వామివారి డోలోత్సవం

విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి డోలోత్సవం (పెళ్లిచూపులు) మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన నిర్వహించి, మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొచ్చారు. తొలుత తన సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్న స్వామివారిని, తన కుమార్తెను వివాహం చేసుకోవాలని అమ్మవారు ప్రార్థించారు. అనంతరం పుష్కరిణి సత్రంలో డోలీపై ఆసీనులైన స్వామివారు, వసంతోత్సవం ముగించుకుని తిరుగు ప్రయాణంలో వివాహానికి అంగీకారం తెలపడంతో భక్తులు, అధికారులు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్