సింహాచలం పుణ్యక్షేత్రంలో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసుకున్న పుష్పరథం బుధవారం రాత్రి 8: 45 గంటలకు తొలిపావంచ వద్దకు చేరుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పరథాన్ని అనుసరిస్తూ ప్రదక్షిణ చేశారు. ఈ దృశ్యం భక్తులకు కనుల పండుగగా మారింది. సింహాచలం దేవస్థానం ఆధ్వర‍్యంలో ప్రదక్షిణ ఘనంగా జరిగింది.