విశాఖపట్నంలోని ఏపీ ఎన్జీవో హోంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి. నారాయణ, జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాజ ప్రగతిలో జర్నలిస్టుల కీలక పాత్రను కొనియాడారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు, రవికుమార్ తదితర జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.