విశాఖ: అతివేగంగా ఆర్మీ అధికారి ఫోన్ రికవరీ

విశాఖలోని మద్దిలపాలెం నుంచి ఆటోలో ప్రయాణిస్తున్న ఆర్మీ సుబేదార్ ధనుంజయ ప్రధాన్ తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఫోన్‌లో ఆర్మీ యూనిట్‌కు సంబంధించిన కీలక సమాచారం, ఫైళ్లు ఉండటంతో ఆయన ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేశారు. ఆటోలోనే సురక్షితంగా ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. పోలీసుల ఈ మెరుపు వేగాన్ని ఆర్మీ అధికారులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్