ఆంధ్ర యూనివర్సిటీ కేవలం పేరు మాత్రమే కాదు, వందేళ్ల చరిత్ర కలిగిన సంస్థ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి ముందే తెలుగువారు పోరాడి సాధించిన విశ్వవిద్యాలయం ఏయూ అని, ఇది ఒక ఎమోషన్ అని ఆయన పేర్కొన్నారు. తాను ఇక్కడ చదివి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు రిస్క్ తీసుకుంటేనే విజయం సాధించగలరని, సాంకేతికతకు అనుగుణంగా కరిక్యులం మారాలని సూచించారు.