విశాఖ: బ్యాడ్మింటన్ విజేత వెంగళరావుకు డిఆర్ఎం అభినందనలు

జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (2025-26)లో ప్రథమ స్థానం సాధించిన విశాఖ వాల్తేర్ డివిజన్ రైల్వే ఉద్యోగి సి. హెచ్. వెంగళరావును డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా గురువారం అభినందించారు. తమిళనాడులోని తిరునల్వేలిలో జనవరి 24 నుండి 26 వరకు జరిగిన ఈ పోటీల్లో వెంగళరావు భారతీయ రైల్వే జట్టుకు ప్రాతినిధ్యం వహించి అద్భుత ప్రదర్శన కనబరిచారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి డివిజన్‌కు కీర్తి తెచ్చినందుకు డిఆర్ఎం ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, క్రీడా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్