విశాఖ జిల్లా వంగలిలో మారిటైమ్ యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద భూములు ఇచ్చిన రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూములు తీసుకున్నప్పుడు, ఉద్యోగ ఖాళీలలో తమకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. అప్పట్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు సమక్షంలో యాజమాన్యం ఈ హామీ ఇచ్చిందని, అయితే ఇప్పుడు బయటివారిని ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారని రైతులు మండిపడ్డారు.