విశాఖ: ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు ద్వారా ఉచిత విద్య

రాష్ట్ర విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు నజీర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చాటిన విద్యార్థుల చిత్రాలతో ప్రకటనలు ఇచ్చి వారిని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా 'తాలిం ఏ హునర్' పథకం ద్వారా 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 250 మంది ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దిశగా త్వరలోనే టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్