విశాఖ‌: రాష్ట్రంలో కాపుల‌కు అన్యాయం

రాష్ట్రంలో కాపు ఉద్యోగులపై అన్యాయం జరుగుతోందని కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎన్. మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఏసీపీ పోస్టుకు కాపు అధికారికి నియామకం ఇచ్చి, ఒక్కరోజులోనే బదిలీ చేయడం అన్యాయమని, నోటీసులు లేకుండా బదిలీలు చేయడం సరైంది కాదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో కాపుల పాత్ర కీలకమని, ఇప్పుడు వారికి గుర్తింపు లేకపోవడం బాధాకరమని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్