విశాఖ: అమ్మవార్ల ఉత్సవాల్లో పాల్గొన్న మణికుమారి

వైస్సార్సీపీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి, శ్రీశ్రీశ్రీ కుంచుమాంబ, నీలమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవంలో పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పిలకవానిపాలెంలో వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజా మహోత్సవానికి ఆమె విచ్చేశారు. అక్కడ అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చుక్క వరలక్ష్మి, జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు పెనుమత్స శ్రీదేవి వర్మ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్