ఆషాడ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరివిడత చందన సమర్పణ గురువారం సంప్రదాయ బద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి విశేష పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన మూడు మణుగుల (సుమారు 125) కిలోల శ్రీగంధాన్ని సమర్పించారు. గిరి ప్రదక్షణ పూర్తి చేసుకొని వచ్చిన అశేష భక్తజనం స్వామిని దర్శించుకున్నారు.