విశాఖ: జర్నలిస్టు హత్యపై మల్కాపురంలో నిరసన

చిత్తూరులో ఆంధ్రజ్యోతి విలేకరి హత్యకు నిరసనగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని మల్కాపురం జంక్షన్‌ వద్ద మంగళవారం రాత్రి పాత్రికేయులు నిరసన చేపట్టారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుంకర చలపతిరావు, ముప్పిడి గిరి, రాజు, ఎన్ఎస్ఆర్ గుప్తా, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్