విశాఖ‌: ఏయూ ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యుడికి అవమానం

ఆంధ్రాయూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు అవమానం జరిగిందని, దళిత ఎంపీగా తనపై వివక్ష చూపారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఇది దళిత సమాజానికి అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏయూ ప్రధాన గేటు ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్