అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఇళ్లకు బిగించకుండా ప్రజలు వ్యతిరేకించాల్సిందిగా సీపీఎం జోన్ కార్యదర్శి బి. జగన్ కోరారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లాలో శనివారం సిపిఎం ఆద్వర్యంలో పాదయాత్రలు చేపట్టారు. జివియంసి 97వ వార్డు కార్మిక నగర్‌లో ఆయన ప్రారంభించిన పాదయాత్రలో మాట్లాడుతూ టిడిపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం అదానీకి అనుకూలంగా ప్రజలకు భారం మోపుతుందన్నారు.