విశాఖ నగరంలో వైయస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్‌అండ్ బీ జంక్షన్ సమీపంలో వెంకటేశ్వర రజక సంక్షేమ సంఘం బల్లల పండగ మహోత్సవాన్ని ప్రారంభించారు. మాఘమాసం సందర్భంగా మాధవధార మాధవస్వామి దేవాలయం వద్ద అన్నప్రసాద సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాదం అందించారు. సిరిపురం ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో శ్రీ కాశీ శ్రీనివాస రాజు గారి పదవీ విరామ కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించారు.