విశాఖలోని పాత గాజువాక డ్రైవర్స్ కాలనీలో ఆదివారం మేడపై గాలిపటం ఎగరేస్తూ ఆకాష్ (09) అనే బాలుడు విద్యుత్ షాక్‌కు గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో తల్లిదండ్రులు అతన్ని కేజీహెచ్‌కు తరలించగా పరిస్థితి విషమించి సోమవారం మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.